మోసమే అతని వృత్తి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నకిలీ కంపెనీలు సృష్టించి ఉపాధికోసం గల్ఫ్ వెళ్లాలనుకునే వారిని దో చుకుంటున్నాడు కామారెడ్డి జిల్లా ఉత్తునూరుకు చెందిన దొండిగల భూమేశ్. పోలీసు కేసులు నమోదై నా అతడి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. కామారెడ్డి జిల్లా ఉత్తునూరుకు చెందిన దొండిగల భూమేశ్ కుటుంబం పన్నెండేళ్లుగా నిజామాబాద్‌లో నివసిస్తుండగా, అతడు ఎనిమిదేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. 2022 మార్చి నుంచి ఆగస్టు మధ్యలో డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన అర్గుల భోజారాం అనే మధ్యవర్తి ద్వారా గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని జగిత్యా ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 80 మంది వద్ద రూ.5 కోట్లు (ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు) తీసుకున్నాడు. ఇందులో 40 మందిని అసలు తీసుకెళ్లలేదు. మరో 40 మందిని మాత్రం విజిట్ వీసా ద్వారా దుబాయికి తీసుకెళ్లి.. మీరెవరో తెలియదంటూ బుకాయించడంతోపాటు బెదిరింపు ధోరణితో వ్యవహరించా డు. చివరకు ఉద్యోగం ఇచ్చే కంపెనీపై కేసు అ యిందని చెప్పి కొరియర్ ద్వారా 40 మందికి టిక్కెట్లు, పాస్‌పోర్టులు పంపాడు. 30 మంది పేర్ల తో దుబాయిలో క్రెడిట్ కార్డులు తీసుకుని రూ.6 కో ట్ల రుణాలు తీసుకున్నాడు. డబ్బులు కట్టాలంటూ దుబాయి బ్యాంకుల నుంచి భారత్‌లో ఉన్న సదరు బాధితులకు ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. రుణాలు తీసుకున్న కార్మికులు భారత్‌కు పారిపోయారని చె ప్పి దుబాయిలో సదరు క్రెడిట్ కార్డుల మీద ఇన్సురెన్స్ సైతం క్లెయిమ్ చేశాడు ఈ మహాముదురు. 2014లోనూ వేల్పూర్‌కు చెందిన 60 మందిని ఇదే తరహాలో భూమేశ్ మోసం చేశాడు. 15 ఏళ్లుగా భూమేశ్ దగా చేస్తూనే ఉన్నాడు.
‘సాక్షి’ కథనాలతో కేసులు
భూమేశ్ చేసిన మోసాలపై 2024 జనవరి 24, 25 తేదీల్లో కథనాలు రావడంతో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కామారెడ్డి జిల్లా బీర్కూర్, నిజామాబాద్ జిల్లా నందిపేట, నవీపేట, మోర్తాడ్, వేల్పూర్, ఆర్మూర్ పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. కాగా 2018 నుంచి భూమేశ్ దుబాయిలో ఉంటుండగా, పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా పీడీ యాక్ట్ పెట్టడంతోపాటు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇంటర్‌పోల్ ద్వారా భూమేశ్‌ను భారత్‌కు రప్పించాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు నిజామాబాద్‌లో ఉంటు న్న భూమేశ్ భార్య స్వప్న మాత్రం తమపైనే అక్రమ కేసులు పెట్టించేందుకు కొందరు రాజకీయ నేప థ్యం ఉన్న వ్యక్తులు, మరో రిటైర్డ్ పోలీసు అధికారి ద్వారా ప్రయత్నాలు చేసిందని బాధితులు చెబుతున్నారు. ఇందల్‌వాయికి చెందిన రమేశ్ అనే వ్యక్తిని దుబాయిలో భూమేశ్ వేధించడంతో గుండెపోటు తో మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
బంగారం పేరిట మరో మోసం
దుబాయి పర్యటనకు వెళ్లిన ఉత్తర భారతదేశానికి చెందిన కొన్ని కుటుంబాల వారిని రూ.60 వేలకే తులం బంగారం ఇప్పిస్తానని చెప్పి రూ.60 లక్షలు తీసుకొని మోసం చేయగా, బాధితులు దుబాయ్‌లో కేసు పెట్టారు. భూమేశ్‌ను అక్కడి పోలీసులు నెల రోజుల క్రితం జైల్లో పెట్టారు. అయితే డబ్బులు ఇచ్చేస్తానని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని నిజామాబాద్‌లో ఉన్న భూమేశ్ భార్య స్వప్న ఉత్తరాది రాష్ట్రాల వారితో బేరం కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.
పేరు మార్చుకొని..
మోసాల నేపథ్యంలో 2014లో దొండిగల భూమేశ్ పాస్‌పోర్టును (కామారెడ్డి జిల్లా అడ్రస్‌తో ఉంది) బీర్కూర్ పోలీసులు సీజ్ చేసి నందిపేట పోలీసు స్టేషన్‌కు పంపారు. దీంతో 2015లో భార్య స్వప్న తల్లిదండ్రుల ఇంటిపేరును వాడుకుని పబ్బ భూమేశ్‌రెడ్డి పేరుతో హైదరాబాద్ అడ్రస్‌తో అక్రమంగా మరో పాస్‌పోర్టు తీసుకున్నాడు. ప్రస్తుతం అతడి వద్ద ఉన్న పాస్‌పోర్టు సైతం 2025 నవంబర్ 18వ తేదీకి ఎక్స్‌పైరీ అయ్యింది. అయినప్పటికీ భూమేశ్ దుబాయిలోనే ఉన్నాడు.
గల్ఫ్‌దేశాల్లో ఉద్యోగాల పేరుతో దగా
దుబాయిలో తిష్ట వేసి
దోచుకుంటున్న ఘనుడు
నకిలీ కంపెనీలు సృష్టించి ఆగడాలు
పాస్‌పోర్ట్ సీజ్ చేసినా మరో
పాస్‌పోర్ట్ పొందిన వైనం
ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్
స్టేషన్‌లలో పబ్బ భూమేశ్‌పై కేసులు


