సకాలంలో పోస్టల్ బ్యాలెట్ అందించాలి
కామారెడ్డి క్రైం : సర్వీస్ ఓటర్లకు సకాలంలో పోస్టల్ బ్యాలెట్ అందించాలని అధికారులను ఆదేశించిన ట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగవారం నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జి ల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డి నుంచి ఎన్నికల సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్ట ర్లు విక్టర్, మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఎన్నిక ల కమిషనర్ సూచనలు ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై చేపడుతున్న వివరాలను తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశం ని ర్వహించారు. సర్వీస్ ఓటర్లు, ఎన్నికల విధుల్లో ఉ న్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులన్నారు. వారి కి సకాలంలో పోస్టల్ బ్యాలెట్ పేపర్లు జారీ చేయాలన్నారు. సర్వీస్ ఓటర్ల ఓటు హక్కును పరిరక్షించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.


