‘గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి’
బిచ్కుంద: బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శ్రేణులు ముందుకు వెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు సూచించారు. మంగళవారం బిచ్కుందలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు బీజేపీ వైపు ఎక్కువ మొగ్గుచూపుతున్నారన్నారు. బీజేపీ మద్దతు ఇచ్చినవారినే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు తమ్మేవార్ అజయ్ పాల్గొన్నారు.


