‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ ప్రారంభం
కామారెడ్డి క్రైం : రాష్ట్ర పోలీసుశాఖ సైబర్ సె క్యూరిటీ బ్యూరో అధికారులు మంగళవారం వర్చువల్ విధానంలో ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీ సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు ఎస్పీ న రసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, సైబర్ సెల్ అధికారులు, సిబ్బంది, కళాశాల ల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరా ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నా రు. అనుమానాస్పద ఫోన్‌కాల్స్, ఆన్‌లైన్ లింక్‌లు, వ్యక్తిగత సమాచార భద్రత తదితర అంశాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. డీపీవోలో 6వారాల పాటు ప్రతి వారం ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చే స్తామని తెలిపారు. అనంతరం ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్ పోస్టర్‌లను ఆవిష్కరించారు.


