‘చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి’
మాచారెడ్డి : ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించా రు. గన్‌పూర్(ఎం) గ్రామ స్టేజీ వద్ద ఏర్పా టు చేసిన చెక్‌పోస్టును మంగళవారం ఆయ న పరిశీలించారు. వాహనాల తనిఖీలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. అక్రమంగా డబ్బు, మద్యం, నిషేధిత వస్తువుల రవాణాకు అవకాశాలు ఎక్కువగా ఉంటా యని గుర్తు చేశారు. బారికేడ్లను సక్రమంగా వినియోగిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఎన్నికలు ముగిసేవరకు 24 గంటల పాటు తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఆయన వెంట ఎస్సై అనిల్, చెక్‌పోస్టు సిబ్బంది ఉన్నారు


