బొందల మీదే చితి పేర్చాలా?
● రామారెడ్డిలో స్థల కొరతతో
అంత్యక్రియలకు అవస్థలు
● మరో వైకుంఠధామం
నిర్మించాలని వినతి
రామారెడ్డి: మనిషి జీవితం ముగిసినా తర్వాత ఆ మృతదేహాన్ని కాల్చేందుకు మండలకేంద్రంలో కష్టాలు ఎ దుర్కోవాల్సి వస్తోంది. ఎవరైనా చనిపోతే పటేల్ చె రువు వైపు, చింతలకుంట వైపు ప్రజలు అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. చింతకుంటలో మాత్రమే వై కుంఠధామం ఉంది. కాగా, పటేల్ చెరువు వైపు అంత్యక్రియలు నిర్వహించడానికి ఆరు గజాల స్థలం అందుబాటులో ఉంది.ఈస్థలంలోనే ఇంతకాలంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ వచ్చారు. హిందూ సాంప్రదా య ప్రకారం కనీసం కాడు చుట్టూ తిరగడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈఆరు గజాల స్థలంలోనే ఇటీవల ఇద్దరు వ్యక్తులను ఖననం(బొందలు) పెట్టారు.ఇప్పుడు ఎవరైనా చనిపోతే అక్కడే పెట్టిన బొందల మీద చితిని పేర్చి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. పటేల్ చెరువు ప్రాంతం రామారెడ్డి నుంచి సదాశివనగర్ ఎన్‌హెచ్–44ను కలుపుతోంది. సమస్యను పరిష్కరించకుంటే ఈరోడ్డుపై అంత్యక్రియలు నిర్వహిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మండలకేంద్రంలో మరో వైకుంఠధామం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.


