బీర్కూర్‌లో లయన్స్ క్లబ్ సేవ కార్యక్రమాలు
బాన్సువాడ : బీర్కూర్‌లో మంగళవారం లయన్స్ క్లబ్ బీర్కూర్‌లో ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో రూ.2500 విలువ గల విద్యుత్ సర్వీసు వైర్లు, మ్యాట్స్ అందజేశారు. అనంతరం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరమున్న వారికి లయన్స్ కంటి ఆస్పత్రి బోధన్‌కు తరలించారు. ఉచిత డయాబెటిక్ శిబిరం నిర్వహించారు. ఈ నెలలో చేయవల్సిన సేవ కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు రమేష్, సంతోష్, రషీద్, ప్రవీణ్, మేకల గాలయ్య తదితరులున్నారు.


