మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలి
దోమకొండ: మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ కోరారు. మంగళవారం మండల చాముండేశ్వరి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌తో పాటు కాలమణి సెంటర్ ఫర్ అగ్రికల్చర్‌ను ఐకేపీ తరపున సందర్శించి అనంతరం సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామ సంఘాల పనితీరుతో పాటు వారి సంఘాల్లో వారి పరిశీలన సర్వీస్ ప్రొవైడర్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంది అని సెర్ప్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. సంఘాల సభ్యులకు ఎంపీడీవో పలు సూచనలు సలహాలు చేశారు. మండల వ్యవసాయాధికారి మణిదీపిక, ఈజీఎస్ ఏపీవో రజిని, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


