ఆ స్థానాలు ఏకగ్రీవమే..!
ఇబ్రహీంపేట్ తండా సర్పంచ్ ఏకగ్రీవం
బాన్సువాడ రూరల్: మండలంలోని ఇబ్రహీంపేట్ తండా సర్పంచ్‌గా పంచాయతీ పరిధిలోని కృష్ణనగర్ తండాకు చెందిన నేనావత్ స్వరూప వసంత్‌ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం తండా పరిధిలోని గిరిజన నాయకులు, గ్రామస్తులు సమావేశమై సర్పంచ్ ఎన్నికల విషయమై చర్చించారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో స్వరూపను ఎంపిక చేశారు. కార్యక్రమంలో మాలెపు నారాయణరెడ్డి, దేవారం ప్రవీణ్‌రెడ్డి, రాజిరెడ్డి, సాయిలు యాదవ్, తండా పెద్దలు బాబుసింగ్ , ప్రేమ్‌సింగ్, మోహన్, కిషన్‌నాయక్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెల్గాపూర్ సర్పంచ్..
నిజాంసాగర్(జుక్కల్): గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాలను గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకున్నారు. రెండవ సారి పంచాయతీ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవ పాలనకు గ్రామస్తులు జై కోట్టారు. మంగళవారం నాటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో సదరు గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా వెల్లుట్ల మేఘన ఒకే ఒక నామినేషన్ దాఖలు చేసింది. అలాగే ఆరు వార్డు స్థానాలకు ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ గడువు ముగియడంతో సదరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వెల్లుట్ల మేఘన ఏకగ్రీవమయ్యారు. వార్డు స్థానాలకు వెల్లుట్ల సాయిలు, నేనావత్ లక్ష్మి, మంజుల, రాములు, అనిత, పోచయ్య ఒక్కొరుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వెల్లుట్ల సాయిలును ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
మాలోత్ సంగ్యానాయక్ తండా సర్పంచ్..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాలోత్ సంగ్యానాయక్ తండాకు చెందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా మాలోత్ సకృనాయక్, ఉపసర్పంచ్‌గా ఽకాట్రోత్ స్వరూప, వార్డు సభ్యులుగా నేనావత్ శాంతి, మాలోత్ రాజు, మాలోత్ జగ్‌రాం, గుగులోత్ మంజూల, కేతావత్ సంతోష్, కొర్ర సవాయి, కోర్ర లాలీబాయిలను ఏకగ్రీవంగా తండా వాసులు ఎన్నుకున్నారు. అనంతరం తండా వాసులు వారిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో తండా పెద్దలు పాల్గొన్నారు.
జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసింది. ఒక నామినేషన్ రావడంతో పలు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.


