బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు
భిక్కనూరు: సర్పంచ్ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు. మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో కొందరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిని బెదిరించి నామినేషన్లను ఉపసహరించుకోవాలని ఒత్తిడికి గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామంలో ప్రజలతో ఎస్సై మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో అందరికి పోటీ చేసే హక్కు ఉంటుందని ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని సూచించారు. అఖిల పక్షం నేతలు ప్రజలు పాల్గొన్నారు.
రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదు
ఎల్లారెడ్డిరూరల్: ప్రయాణికులు వారి వెంట రూ. 50 వేలకు మించి నగదును తీసుకెళ్లరాదని తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్న దృష్ట్యా నగదును తీసుకెళ్లే వారు సంబంధిత రసీదులు వెంట ఉంచుకోవాలన్నారు. డీటీ శ్రీనివాస్, గిర్దావార్ శ్రీనివాస్ తదితరులున్నారు.


