ఉత్సవాలకు శబరిమాత ఆశ్రమం ముస్తాబు
● 4, 5 తేదీల్లో జాతర
● తాడ్వాయికి భారీ సంఖ్యలో
రానున్న భక్తులు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో ఈనెల 4, 5 తేదీల్లో 55వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం సుప్రభాత ధ్యానంతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం 12గంటలకు వేంకటేశ్వర కల్యాణం, దత్త జయంతి కార్యక్రమాలను వైభవంగా జరిపిస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారితో ప్రవచనములు, భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. శుక్రవారం హంస వాహనంలో శబరిమాత చిత్రపటాన్ని ఉంచి డప్పు వాయిద్యాలు, నృత్యాలు, భజన కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఈసారి ఉత్సవాలకు ఐదులక్షల మంది భక్తులు హాజరు అవుతారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.కామారెడ్డి బస్టాండ్ నుంచి తాడ్వాయి శబరిమాత ఆశ్రమం వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు.


