రెండు బైక్‌లు ఢీ: ఒకరి మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గోపాల్‌పేట–లొంకలపల్లి రోడ్డుపై రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా.. మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన నీరుడి పొశెట్టి మంగళవారం తన బైక్‌పై పొలానికి బయలుదేరాడు. లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన మున్రూరు మహేందర్(30) తన బైక్‌పై గోపాల్‌పేటకు బయల్దేరాడు. కాగా మండలంలోని గోపాల్‌పేట–లొంకలపల్లి రోడ్డుపై ఇరువురి బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటలో ఇరువురు తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మహేందర్ మృతిచెందాడు. పోశెట్టిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.


