లైసెన్స్‌లు లేకుండా దుకాణాలు నడిపితే కేసులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో లైసెన్స్‌లు లే కుండా కల్లుదుకాణాలను నిర్వహిస్తే కేసులు త ప్పవని ఎల్లారెడ్డి ఎకై ్సజ్ సీఐ షాకీర్‌అహ్మాద్ పేర్కొన్నారు. మండలంలోని మేజర్‌వాడి గ్రామంలో అ నుమతులు లేకుండా నిర్వహిస్తున్న కల్లుదుకాణంపై మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. మండలంలోని చీనూర్, గోలిలింగాల గ్రామాల్లో నిర్వహిస్తున్న కల్లుదుకాణాలను తనిఖీ చేసి శాంపిళ్లను సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేజర్‌వాడిలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న కల్లుదుకాణాన్ని సీజ్ చేశామని, దుకాణాదారు మల్లాగౌడ్‌పై కేసునమోదు చేశామన్నారు. గోపాల్‌పేటలోని వైన్‌షాపు నుంచి వందమీటర్లలోపు ఎలాంటి గుళ్లు, మసీదులు, చర్చిలతోపాటు బడులు లేనందున ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే షాపు కొనసాగుతుందన్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కఠినచర్యలు చేపడతామని హెచ్చరించారు. హెడ్‌కానిస్టేబుల్ పెంటయ్య, కానిస్టేబుళ్లు రవీందర్‌రెడ్డి, రజిత, స్రవంతి తదితరులున్నారు.


