తొలిరోజు 155 | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు 155

Dec 1 2025 9:36 AM | Updated on Dec 1 2025 9:36 AM

తొలిర

తొలిరోజు 155

న్యూస్‌రీల్‌

తొలివిడత నామినేషన్ల పరిశీలన తర్వాత బరిలో మిగిలిన అభ్యర్థులు..

సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

– 8లో u

జిల్లాలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్‌ స్థానాలకు 81, వార్డులకు 74 నామపత్రాలు దాఖలయ్యాయి. మరో రెండు రోజులపాటు ప్రక్రియ కొనసాగనుంది. మరోవైపు మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది.

సాక్షి ప్రతినిధి, కామారె డ్డి : పంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయ వేడి పెరిగింది. తొలివిడత ఎన్నికలు జరిగే పది మండలా ల్లో నామినేషన్ల దాఖ లు గడువు ముగియడంతో పాటు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఈనెల 3 వ రకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీల నేతలు రంగంలోకి దిగారు. తమ పార్టీకి చెందిన వారిని ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల సింగిల్‌ నామినేషన్లు దాఖలు కావడంతో వారు ఏకగ్రీవమైనట్లే.. మరికొన్నింటిని ఏకగ్రీవం చేసుకుని సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.

సింగిల్‌ నామినేషన్లు వచ్చిన స్థానాలు ఇవే..

తొలి విడతలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్త యి, నామినేషన్ల పరిశీలన తర్వాత సక్రమమైన నా మినేషన్ల లెక్క తేలింది. ఇందులో ఒకే నామినేషన్‌ దాఖలైనవాటిని ఏకగ్రీవమైనట్లుగా భావిస్తారు. ప ది మండలాల్లోని 167 పంచాయతీల్లో ఐదు గ్రామా ల సర్పంచ్‌ పదవులకు సింగిల్‌ నామినేషన్‌ దాఖలు కావడంతో అవి ఏకగ్రీవమైనట్లే.. బీబీపేట మండ లం శివారు రాంరెడ్డిపల్లి, మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లితండా, వెనుక తండా, పాల్వంచ మండలంలోని భవానీపేట తండా, సదాశివనగర్‌ మండలంలోని తుక్కోజీవాడి గ్రామాల్లో సర్పంచ్‌ పదవు లు ఏకగ్రీవమయ్యాయి. వీటిని ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించాల్సి ఉంది.

రెండో విడతలో..

రెండో విడతలో ఏడు మండలాల్లోని 197 గ్రామాల సర్పంచ్‌ పదవులతోపాటు 1,654 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మొదలైంది. 57 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలిరోజు సర్పంచ్‌ స్థానాలకు 81 నామినేషన్లు, వార్డులకు 74 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 2 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

మండలం సర్పంచ్‌ అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు

భిక్కనూరు 18 110 182 530

బీబీపేట 11 60 110 272

దోమకొండ 09 57 96 279

కామారెడ్డి 14 86 120 335

మాచారెడ్డి 25 163 196 425

పాల్వంచ 12 71 110 294

రాజంపేట 18 105 158 355

రామారెడ్డి 18 103 166 422

సదాశివనగర్‌ 24 111 214 452

తాడ్వాయి 18 85 168 345

మొత్తం 167 951 1,520 3,709

రెండో విడత నామినేషన్ల

ప్రక్రియ షురూ

సర్పంచ్‌ స్థానాలకు 81,

వార్డులకు 74 దాఖలు..

పూర్తయిన తొలి విడత

నామపత్రాల పరిశీలన

తొలిరోజు 1551
1/2

తొలిరోజు 155

తొలిరోజు 1552
2/2

తొలిరోజు 155

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement