పంచాయతీ నుంచే తొలి అడుగు
తాడూరి బాలాగౌడ్
● గ్రామ ప్రథమ పౌరుల నుంచి శాసనసభకు పలువురు..
● జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ,
మంత్రులుగా సేవలందించిన నేతలు
లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలో జన్మించిన బాలాగౌడ్ 60వ దశకంలో బోనాల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా తన రాజ కీయ జీవితాన్ని ప్రారంభించారు. 1972లో బోనాల్ స ర్పంచ్‌గా గెలిచిన ఆయన తదనంతరం ఎల్లారెడ్డి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది భవ నం వెంకట్రామ్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గాలలో చక్కెర పరిశ్రమ, రోడ్లు భవనాల శాఖల మంత్రిగా పనిచేశారు. 1983లో ఎన్టీఆర్ ప్ర భంజనానికి ఎమ్మెల్యేగా ఓడి పోయినా 1984, 1989లలో రెండు పర్యాయాలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగారు. అనంతరం నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా సేవలందించారు.
ఎల్లారెడ్డి: రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులు అధిరోహించిన పలువురు నేతలు సర్పంచ్ పదవితోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఆయా నేతలు గ్రామ ప్రథమ పౌరులుగా బాధ్యతలు నెరవేర్చిన తర్వాత ఉన్నత పదవులు పొందినవారే. కొందరు నేతలు జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా పనిచేశారు. పంచాయతీ నుంచే రాజకీయంలో తొలి అడుగులు వేసిన నేతలపై ప్రత్యేక కథనం...


