
భూభారతి దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నెలరోజులలోపు పరిష్కరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సిబ్బందిని ఆదేశించారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి.. రెవెన్యూ దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో 499 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా వాటిలో 152 మందికి నోటీసులు అందజేశామని, మిగిలిన వాటీలో చాలావరకు అటవీశాఖకు చెందిన దరఖాస్తులే వచ్చాయని తెలిపారు. నూతనంగా మండలంలో విలీనమైన బాబుల్ గావ్ గ్రామస్తులు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదని సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. సమస్యను ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తామని గ్రామస్తులకు హమీ ఇచ్చారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో సబ్‌కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, నాయబ్ తహసీల్దార్ రవికాంత్,ఆర్‌ఐ అంజయ్య రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కేవీ కోసం స్థల పరిశీలన
మద్నూర్: మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటకు అధికారులు ఎంపిక చేసిన స్థలాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర కమిషనర్ మంజూనాథ్ శనివారం పరిశీలించారు. మద్నూర్‌లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు తాత్కాలిక భవనంతోపాటు శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. వారివెంట డీఈవో రాజు, తహసీల్దార్ ముజీబ్, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.