
పురుగు మందుల దుకాణాల తనిఖీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పురుగు మందుల దుకాణాలను గాంధారి ఏవో రాజలింగం, ఎల్లారెడ్డి ఏవో నదీమ్, ఎస్సై ఆంజనేయులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. పురుగు మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు శీర్షికతో సాక్షిలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. స్పందించిన వ్యవసాయశాఖాధికారులు పోలీసులతో కలిసి తనిఖీలు చేసి దుకాణాల్లో విక్రయించే మందులు, రికార్డులు పరిశీలించారు.
సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలి
పిట్లం(జుక్కల్): నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే అరుణతార డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించి మధ్యలో వదిలేయడంతో ఆమె నాయకులతో కలిసి శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. అనంతరం అరుణతార మాట్లాడుతూ.. రోడ్లను అస్తవ్యస్తంగా తవ్వేసి పనులు ప్రారంభించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. దీంతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాయకలు అశోక్ రాజ్, రవి చంద్ర, మండల పార్టీ అధ్యక్షులు గుండా సాయిరెడ్డి, మాజీ అధ్యక్షుడు అభినయ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దేవేందర్, ఉపాధ్యక్షులు సాయి గొండ, తదితరులు పాల్గొన్నారు.

పురుగు మందుల దుకాణాల తనిఖీ

పురుగు మందుల దుకాణాల తనిఖీ