
ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
రాజంపేట: ప్రతి విద్యార్థిని బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాఽయికి చేరుకోవాలని మహిళా సాధికారత సిబ్బంది సౌందర్య అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం రాజంపేట బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత సిబ్బంది సౌందర్య మాట్లాడుతూ.. బేటీ బచావో బేటీ పడావో అనే విధానంలో ప్రతి ఆడపిల్ల చదువుకొని స్వతహా గా తనకు తాను నిర్ణయాలు తీసుకునే దశకి వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్స్ 1098, 100, 1930 ,181లపై అవగాహన ఉండాలన్నారు. హెచ్‌ఎం విజయలక్ష్మి, సఖి సెంటర్ సిబ్బంది లావణ్య పాల్గొన్నారు.