
ఖాళీ స్థలాలు.. అపరిశుభ్ర నిలయాలు
కామారెడ్డి టౌన్: పట్టణంలోని ఖాళీ స్థలాలు అపరిశుభ్ర వాతావరణానికి నిలయాలుగా మారాయి. ఈ పాట్లను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత వాటి యజమానులదే. కానీ వారు ఏళ్ల తరబడిగా పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, మురుగు నీటితో నిండిపోతున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. వర్షాలకు వా టిలో నీరు నిలిచి మురికి కూపంలా తయారవుతున్నాయి. నిల్వ నీటిలో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సీజన ల్ వ్యాధులు ప్రబలకుండా మందస్తు చర్యల్లో భా గంగా ఇటువంటి స్థలాలపై దృష్టి పెట్టి, అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూడాలని కోరుతున్నారు.
ప్రతి వార్డులో వందల సంఖ్యలో..
కామారెడ్డి పట్టణంలో 49 వార్డులున్నాయి. ప్రతి వా ర్డులో వందకు పైగా ఖాళీ స్థలాలున్నాయి. విలీన గ్రామాలతో పాటు, శివారు కాలనీలలో అంతకుమించి ఖాళీ స్థలాలు ఉన్నాయి. సమీపంలోని ఇళ్లవాసులు చెత్తాచెదారాన్ని ఈ ఖాళీ ప్రదేశాల్లో పడేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఖాళీ స్థలాలు దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. అశోక్‌నగర్, స్నేహపురి కాలనీ, శ్రీరాంనగర్, బతుకమ్మకుంట, విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీ, దేవునిపల్లి, వికాస్‌నగర్, గాంధీనగర్, టీచర్స్‌కాలనీ, ఇందిరానగర్, రాజానగర్, అయ్యప్పనగర్, భవానీనగర్, హౌసింగ్‌బోర్డు, బడాకసాబ్‌గల్లి, సైలానీబాబా కాలనీ, పంచముఖి హనుమాన్, రుక్మిణీకుంట, ఒడ్డెరకాలనీ, వాంబేకాలనీ, గ్రీన్‌సీటి తదితర కాలనీలతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, రామేశ్వరపల్లి, పాతరాజంపేట, సరంపల్లి, దేవునిపల్లి, లింగాపూర్, టేక్రియాల్‌లలో ఇళ్ల పక్కన ఖాళీ స్థలాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇచ్చి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నోటీసులు జారీ చేస్తాం
పట్టణంలో అధ్వానంగా ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. ముందస్తుగా ఖాళీ స్థలాల యజమానులు స్పందించి వారి ప్లాట్లను శుభ్రం చేసుకోవాలి.
– రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి
ఏళ్ల తరబడి తమ ప్లాట్లవైపు
కన్నెత్తి చూడని స్థలాల యజమానులు
పిచ్చి మొక్కలు, మురుగుకు నిలయాలు, దోమలు, ఈగలు, పాములకు ఆవాసాలు..
వ్యాధుల బారిన పడుతున్న
పట్టణవాసులు

ఖాళీ స్థలాలు.. అపరిశుభ్ర నిలయాలు

ఖాళీ స్థలాలు.. అపరిశుభ్ర నిలయాలు