
‘సరిపడా ఎరువులున్నాయి’
సదాశివనగర్ : జిల్లాలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసా య అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్, విండో కార్యాలయం, స దాశివనగర్, పద్మజీవాడి, ఉత్తనూర్ సొసైటీలను తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీపై ఆ రా తీశారు. జిల్లాలో ఎరువుల కొరతలేదని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించా రు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అ ధికారి ప్రజాపతి, ఏఈవోలు పాల్గొన్నారు.
డీపీఎంల బదిలీ
కామారెడ్డి క్రైం : జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లో ముగ్గురు డీపీఎంలు బదిలీపై ఇతర జి ల్లాలకు వెళ్లారు. ఇతర జిల్లాలనుంచి నలుగు రు జిల్లాకు వచ్చారు. ఇక్కడ డీపీఎంలుగా ప నిచేసిన సుధాకర్, రమేశ్‌బాబు, రవీందర్ బ దిలీపై ఇతర జిల్లాలకు వెళ్లారు. నిజామాబా ద్ జిల్లా నుంచి డీపీఎంలు శ్రీనివాస్, సాయి లు, నిర్మల్ నుంచి శోభారాణి, సిద్దిపేట నుంచి రాజయ్య కామారెడ్డి జిల్లాకు వచ్చారు. ప్ర స్తుతం డీఆర్‌డీఏ పింఛన్‌ల విభాగం డీపీఎంగా ఉన్న సురేష్ కుమార్‌ను వ్యవసాయ ఆ ధారిత జీవనోపాదుల డీపీఎంగా మార్చా రు. నూతన డీపీఎంలు మంగళవారం కలెక్ట ర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా క లిశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో సురేంద ర్, అధికారులు పాల్గొన్నారు.
‘కాంగ్రెస్ సభకు
తరలిరావాలి’
కామారెడ్డి టౌన్: హైదరాబాద్‌లోని లాల్ బ హదూర్ స్టేడియంలో ఈనెల 4న నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏఐసీ సీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనే ఈ స భకు ప్రతి నియోజకవర్గం నుంచి గ్రామ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయ కులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. సమా వేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీని వాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, నాయకులు పంపరి లక్ష్మణ్, రాజాగౌడ్, లక్కపత్రి గంగాధర్, కిరణ్ కు మార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థులు వీణ, భవానీ జాతీయ స్థాయి హాకీ పోటీల కు ఎంపికయ్యారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపడంతో రా ష్ట్ర జట్టుకు ఎంపిక చేశారని పాఠశాల వ్యా యామ ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థా యి సబ్ జూనియర్ బాలికల హాకీ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. పాఠశాల హెడ్‌మాస్టర్ ఎల్లయ్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు క్రీడాకారులు వీణ, భవానీలను అభినందించారు.
ప్రారంభమైన ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎంసెట్ మొదటి విడత ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం ప్రారంభమైంది. ధ్రువపత్రాల పరిశీలనకు 823 మంది కామారెడ్డి కేంద్రాన్ని ఎంచుకున్నారని కౌన్సెలింగ్ సమన్వయకర్త, కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ తెలిపారు. ఈనెల 4వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతుందన్నారు. పరిశీలనలో అధికారులు అజారుద్దీన్, ఫర్హీన్ ఫాతిమా, అఫ్రీన్ ఫాతిమా, శ్రీలత, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

‘సరిపడా ఎరువులున్నాయి’

‘సరిపడా ఎరువులున్నాయి’

‘సరిపడా ఎరువులున్నాయి’