
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కార్యకర్తలు తెలుసుకోవాలి
● క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కచ్చితంగా తెలసుకుని ముందుకు వెళ్లాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. మంగళవారం నిజామాబా ద్‌లో ఈవీఎం గార్డెన్స్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కోరుట్ల, జగిత్యాల, జుక్కల్‌ల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఆయా కార్పొరేషన్ల చైర్మన్‌లు, జిల్లా బాధ్యులు, పలు విభాగాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వాటిని ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు వెనకబడి ఉన్నారన్నా రు. ఈనెల 4న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యకర్తల సదస్సుకు వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని, ప్రతి గ్రామం నుంచి 500 మందిని తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జిల్లాకువచ్చి డ బుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని మాట్లాడారని, డ బుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏమీ లాభం లేదని ప్రభు త్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నా రు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రే షన్ దుకాణాల్లో మోదీ బొమ్మ పెట్టాలనడం అర్ధరహితమన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌మోహన్ రావు, లక్ష్మీకాంతారావు, సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, సంజయ్, వెడ్మ బొజ్జు, కార్పొరేషన్‌ల చైర్మన్ లు ఈరవత్రి అనిల్, తాహెర్‌బిన్ హందాన్, మా నాల మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారె డ్డి, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, విన య్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.