
ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి
కామారెడ్డి టౌన్: ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ క్యాంపెయిన్ ప్రోగ్రాంకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ వరకు మూడు నెలలపాటు ప్రజలకు ఇన్సూరెన్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. అందరితో బ్యాంక్ ఖాతాలు తెరిపించడం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి, అటల్ పెన్షన్ యోజన తదితర స్కీంలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరితో మినిమం ఇన్సూరెన్స్ చేయించాలని అదనపు కలెక్టర్ చందర్‌నాయక్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.