
దరఖాస్తుల గడువు పొడగింపు
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించడానికి ఈనెల 5వరకు గడువు పొడిగించినట్టు జిల్లా సంక్షేమాధికారి ఏ.ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ సహాయం పొందాలని సూచించారు.
ఆర్‌అండ్‌బీ ఈఈగా మోహన్
కామారెడ్డి క్రైం: రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పి.మోహన్ నియమితులయ్యారు. ఇదివరకు ఇక్కడ ఈఈగా పని చేసిన రవిశంకర్ పదోన్నతిపై రంగారెడ్డి జిల్లాకు వెళ్లారు. బాన్సువాడ డిప్యూటీ ఈఈగా పనిచేసిన మోహన్.. కామారెడ్డి ఈఈగా పదోన్నతిపై వచ్చారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.