
సీసీ కెమెరాలుంటే పోలీసులున్నట్టే
మాచారెడ్డి: గ్రామాల్లో సీసీ కెమెరాలుంటే పోలీసులున్నట్టేనని మాచారెడ్డి ఎస్సై అనిల్ అన్నారు. సోమవారం పాల్వంచ మండలం వాడిలో ముదిరాజ్ సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అంతర్‌జిల్లా
దొంగల ముఠా రిమాండ్
● 12 తులాల బంగారం, బైక్ స్వాధీనం
వేములవాడ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాను రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ పోలీసులు సోమవారం తెలిపారు. వేములవాడ టౌన్ పీఎస్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మహేశ్ బీ గీతే వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన బోదాసు మహేశ్ నిజామాబాద్ జిల్లాకు చెందిన గద్దల స్వప్న, విశాల్‌సింగ్, జగిత్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల శ్రీనివాస్, నేరెళ్ల రాణి, గోత్రాల బాలమణి ముఠాగా ఏర్పడి ఆర్మూర్, నిజామాబాద్, వేములవాడ, కోనరావుపేట, బోయినపల్లి ప్రాంతాల్లో గత రెండు నెలలుగా దొంగతనాలకు పాల్పడ్డారు. టెక్నాలజీ సాయంతో వీరు వేములవాడ సమీపంలో తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 తులాల బంగారం, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. దొంగలను పట్టుకున్న వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు అనిల్‌కుమార్, వెంకట్రాజం, సిబ్బంది గోపాల్, పంతులు, లత, సాహెబ్ హుస్సేన్, దేవేందర్, సమియుద్దీన్‌ను అభినందించారు.