
ఆయిల్ పామ్ సాగుతో లాభాలు
నిజాంసాగర్(జుక్కల్): ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మహమ్మద్ నగర్ ఏవో నవ్య అన్నారు. మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో శనివారం ఆయిల్ పామ్ సాగుపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నీటి లభ్యత తక్కువగా ఉన్న భూస్వాములు ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. వరి, ఆరుతడి పంటలకు దీటుగా ఆయిల్ పామ్ ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులను ప్రభుత్వం ప్రొత్సహిస్తుందన్నారు. గున్కుల్ సొసైటీ వైస్ చైర్మన్ గొట్టం నర్సింలు, మాజీ సర్పంచ్ రాజేశ్వర్‌గౌడ్, గంగారాం, భూమాగౌడ్, అంజయ్య, పెద్దసాయాగౌడ్, ఏఈవో మదుసూధన్, పంచాయతీ కార్యదర్శి బలరాముడు, కారోబార్ ప్రభాకర్ ఉన్నారు.