
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మాచారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మండలంలోని మాచారెడ్డి, చుక్కాపూర్, ఎల్లంపేట, సోమారంపేట, గజ్యానాయక్ తండా గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానన్నారు. తన సొంత నిధులతో గ్రామగ్రామాన అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. నాయకులు బూస సురేష్, పొన్నాల వెంకట్ రెడ్డి, పుట్టకొక్కుల నర్సింలు, పండ్ల ప్రవీణ్, భరత్, కృష్ణగౌడ్, కళ్యాణ్, రవి పాల్గొన్నారు.