
యూరియా కోసం రైతుల బారులు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా ఎరువుల కోసం శనివారం రైతులు బారులు తీరారు. గోదాంకు యూరియా ఎరువుల లారీలు వచ్చాయని తెలియగానే ఉదయం నుంచే సొసైటీ పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులు వచ్చి క్యూలో నిల్చొని యూరియా ఎరువులను తీసుకున్నారు. ప్రస్త్తుం మొక్కజొన్న, పత్తి, సోయ పంటలకు ఎరువులు వేసే సమయం వచ్చిందని రైతులు తెలిపారు. ఏఈవో శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికీ 9666 సంచుల యూరియా ఎరువులను పంపిణీ చేసినట్లు తెలిపారు. యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు.