
వసతి గృహానికి స్థలం కేటాయించండి
కామారెడ్డి టౌన్: జిల్లాలో మున్నూరు కాపు బాలబాలికల కోసం కావలసిన వసతి గృహానికి రెండు ఎకరాల స్థలము కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను మున్నూరు కాపు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌రావు కోరారు. శుక్రవారం ఆయనని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి హాస్టల్‌కు స్థలం, భవన నిర్మాణానికి కావాల్సి నిధులు మంజూరు చేయించాలని కోరారు.
జూలై 2న జగన్నాథ
రథయాత్ర
కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో జూలై 2న మధ్యాహ్నం 2 గంటలకు 3వ జగన్నాథ రథయాత్ర ఉత్సవం నిర్వహించనున్నట్టు స్థానిక ప్రతినిధి వెంకటదాస్ ప్రభు తెలిపారు. జగన్నాథ రథోత్సవం సాయిబాబా ఆలయం చౌరస్తా నుంచి జీవదాన్ మీదుగా సిరిసిల్లరోడ్డు శ్రీకన్యాక పరమేర్వరి ఆలయం వరకు కొనసాగుతుందని, సాయంత్రం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమానికి బరోడా ఇస్కాన్ అధ్యక్షుడు వాసుగోష్ ప్రభు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
వంద రోజుల
కార్యాచరణ అమలు
బాన్సువాడ: మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల కార్యాచరణ పక్కాగా అమలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత బాన్సువాడలో వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మురికి కాలువల్లో దోమల మందు పిచికారీ చేయించారు. అనంతరం ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మేనేజర్ మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, సిబ్బంది హన్మండ్లు, సతీష్, లక్ష్మణ్, సురేందర్ తదితరులున్నారు.

వసతి గృహానికి స్థలం కేటాయించండి