
వసతి గృహం తనిఖీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రం భవానీనగర్‌లోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి(డీటీడబ్ల్యూవో) సతీష్ యాదవ్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ సంక్షేమ అధికారి నవీన్ పాల్గొన్నారు.
సదాశివనగర్‌లో గ్రంథాలయం..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంశీకృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న నెలవారి మేగజైన్‌లు, వార్తా పత్రికలు, పుస్తకాల గురించి ఆరా తీశారు. నిరుద్యోగులకు స్టడీ కుర్చీలను తెప్పించాలని కోరారు. సంబంధిత వివరాలను జిల్లా కార్యాలయానికి పంపించాలని గ్రంథపాలకుడు శ్రీనివాస్‌కు సూచించారు.
సమ్మె నోటీసు అందజేత
కామారెడ్డి టౌన్: జులై 9న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మె నోటీసును తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డికి అందజేశారు. సమ్మెలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. యూనియన్ అధ్యక్షుడు అయాజ్‌బేగ్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్మికులు పాల్గొన్నారు.
తీర్థయాత్రలకు బస్సు సౌకర్యం
బాన్సువాడ: బాన్సువాడ నుంచి తీర్థయాత్రలకు బస్సు సౌకర్యం ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం సరితాదేవి తెలిపారు. శుక్రవారం బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, ఘనగపూర్, వేములవాడ, మెదక్ చర్చి, రహమాతాబాద్ దర్గా తదితర ప్రాంతాలకు బస్సు సర్సీసు అందుబాటులో ఉంటాయన్నారు. డీలక్స్ బస్సులో కనీసం 35 సీట్లు బుక్ చేయాల్సి ఉంటుందని అన్నారు. పూర్తి వివరాలకు గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని సూచించారు.

వసతి గృహం తనిఖీ