
నిర్ణయించిన ధరకే ఇసుక విక్రయించాలి
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లకు అధికారులు నిర్ణయించిన ధరతోనే ఇసుక విక్రయించాలని, అధిక ధరతో విక్రయిస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధిక ధరలకు ఇసుక విక్రయిస్తున్నారనే ఫిర్యాదులతో ఆమె స్పందించారు. మండల తహసీల్ కార్యాలయంలో శుక్రవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎంవీఐ శ్రీనివాస్ ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. బిచ్కుంద మండలానికి రూ.2,500, జుక్కల్, మద్నూర్, పెద్దకొపడ్‌గల్, పిట్లం మండలాలకు రూ.3,500, నిజాంసాగర్ మండలానికి రూ.4,000 ధరతో ఇసుక వేయాలన్నారు. ఒక్కో లబ్దిదారుని అవసరాన్ని బట్టి రెండు, మూడు ట్రాక్టర్ ఇసుక కోసం పర్మిట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బిచ్కుంద తహసీల్ కార్యాలయంలో అంటెడర్‌గా పని చేసిన హన్మండ్లు పదవీ విరమణ కార్యక్రమంలో ఆమె పాల్గొని సన్మానించారు.
భూ సమస్యలు త్వరగా పరిష్కరించండి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని అకస్మాతుగా తనిఖీ చేశారు. దరఖాస్తుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని.. స్థానిక రెవెనూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ దశరథ్, నాయబ్ తహసీల్దార్ రవికాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి