
ఆలయ అభివృద్ధికి కృషి
మాచారెడ్డి: వీర హనుమాన్ వేంకటేశ్వర ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మండలంలోని వీర హనుమాన్ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా షబ్బీర్ అలీ, ఏఐసీసీ ఇన్‌చార్జి విశ్వనాథన్ మురుగన్, ఎంపీ సురేష్ షెట్కార్ హాజరయ్యారు. నూతన కార్యవర్గంతో దేవాదాయ శాఖ పరిశీలకులు కమల ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా శనిశెట్టి రాజమౌళి, డైరెక్టర్లుగా రాజేశం, శాంతి, సత్యనారాయణ, దేవయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. మాజీ ఎంపీపీ నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నౌసీలాల్, నాయకులు లక్ష్మారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, గణేష్ నాయక్, కమలాకర్‌రెడ్డి, ఈవో ప్రభు సిబ్బంది ఉన్నారు.