
వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
బాన్సువాడ/తాడ్వాయి/ఎల్లారెడ్డి రూరల్: మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో బాన్సువాడ విద్యార్థి నిఖిల్‌గౌడ్, తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి పాఠశాలకు చెందిన కుమ్మరి తరణి, ఎల్లారెడ్డి మండలం అడివిలింగాల జెడ్పీ పాఠశాల విద్యార్థిని సౌమ్య ప్రతిభా కనబర్చడంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. గురువారం కామారెడ్డిలో వీరికి సర్టిఫికెట్లు, మెమోంటో అందజేశారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
కామారెడ్డి టౌన్: మూడు నెలల జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని తెలంగాణ ప్రగతి శీల జీపీ వర్కర్స్ యూనియన్ నేత రమేశ్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కనీస వేతనం రూ. 26వేలు అమలు చేయాలన్నారు. జీవో– 51 రద్దు చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు.

వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ