సామాజిక అంశాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

సామాజిక అంశాలపై అవగాహన

Jun 27 2025 4:15 AM | Updated on Jun 27 2025 4:15 AM

సామాజ

సామాజిక అంశాలపై అవగాహన

లింగంపేట(ఎల్లారెడ్డి): స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం మహిళా సంఘాలకు సామాజిక అంశాలపై ఎంపీడీవో నరేష్‌ అవగాహన కల్పించారు. వన మహోత్సం, సీజనల్‌ వ్యాధులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకం అమలు తదితర విషయాల గురించి వివరించారు. అలాగే సంఘాల బలోపేతం, సభ్యుల ఆదాయ వ్యయాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని, సంఘాల లావాదేవీలు ఆడిట్‌ చేయించాలని సూచించారు. మండల సమాఖ్య అధ్యక్షులు సులోచన, ఏపీఎం శ్రీనివాస్‌, ఎంపీవో మలహరి, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌

స్లాబ్‌ పనుల పరిశీలన

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ స్లాబ్‌ పనులను హౌసింగ్‌ డీఈఈ సుభాష్‌, నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రభాకరచారి పరిశీలించారు. నిబంధనల మేర కు స్లాబ్‌ పనులు చేపట్టేలా కాంట్రాక్టర్‌కు సూచనలు చేశారు.క్రమం తప్పకుండా ప్రతిరోజూ స్లాబ్‌ క్యూరింగ్‌ పనులు చేపట్టాలని వారు సూచించారు.హౌసింగ్‌ ఏఈ సందీప్‌ ఉన్నారు.

ఈ–కేవైసీ తప్పనిసరి

నస్రుల్లాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సహాయం కోసం రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేసుకోవాలని ఏఈవో గ్రీష్మ అన్నారు. అందులో భాగంగా మిర్జాపూర్‌ క్లస్టర్‌కు సంబందించి 34 మంది చేసుకోలేదని తెలిపారు. ఈసందర్భంగా గురువారం కామిశెట్టిపల్లిలో ఫేసియల్‌ యాప్‌ ద్వారా కేవైసీ చేశామన్నారు. డబ్బులు పడుతూ కేవైసీ చేసుకోని వారు ఉన్నా కూడా తప్పకుండా ఈ–కేవైసీ చేసుకోవాలని సూచించారు.

‘పద్మశాలి’ కార్యవర్గం ఎన్నిక

బీబీపేట: మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం మండల నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తుమ్మ మచ్చేందర్‌, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌, కోశాధికారిగా బాలే సహదేవ్‌, ఉపాధ్యక్షుడిగా శంకర్‌, ఉప కార్యదర్శిగా అల్వాల నర్సింలు, కార్యవర్గ సభ్యులుగా రాజేందర్‌, అంకాలం నరేందర్‌, గణేష్‌, వేణు, భాస్కర్‌, లక్ష్మీనారాయణ, మహిళ సభ్యులుగా జమున, ఉషశ్రీ, లావణ్య ఎన్నికయ్యారు. నేతలు చందుపట్ల విఠల్‌, జనార్దన్‌, పురుషోత్తం, సందీప్‌, రాజు, కిష్టయ్య, రామచంద్రం పాల్గొన్నారు.

స్టాఫ్‌ నర్సుకు అభినందనలు

లింగంపేట(ఎల్లారెడ్డి): స్థానిక పీహెచ్‌సీలో బుధవారం రాత్రి కష్టతరమైన డెలివరీ చేసిన స్టాఫ్‌ నర్సు ప్రతిభను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అభినందించారు. వివరాలు.. సురాయిపల్లి తండాకు చెందిన గర్భవతిని బుధవారం రాత్రి పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న నర్సు గర్భవతిని పరీక్షించగా.. గర్భంలో మాయ ఎక్కువగా ఉంది.. బిడ్డ మెడచుట్టూ బొడ్డుతాడు(పేగు) చుట్టుకొని ఉన్నట్లు గమనించారు. అయినా సాహసం చేసి స్టాఫ్‌ నర్సు ప్రతిభ నార్మల్‌ డెలివరీ చేసినట్లు పీహెచ్‌సీ వైద్యులు రాంబాయి తెలిపారు. బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు.

సెర్ప్‌లో బదిలీలు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో బదిలీలు జరిగా యి. ఏపీడీగా పనిచేస్తున్న మురళీకృష్ణ హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో హైదరాబాద్‌ నుంచి విజయలక్ష్మి వచ్చారు. అలాగే డీపీఎంలు సుధాకర్‌ సంగారెడ్డి జిల్లాకు, రమేశ్‌బాబు జనగామ జిల్లా కు, రవీందర్‌రావ్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. కాగా నిజామాబాద్‌ నుంచి నూకల శ్రీనివాస్‌, మేకల సాయిలు, సిద్దిపేట నుంచి జి.రాజయ్య జిల్లాకు వస్తున్నారు.

సామాజిక అంశాలపై అవగాహన 
1
1/1

సామాజిక అంశాలపై అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement