
‘డబుల్’ ఇళ్ల బిల్లులు నొక్కేశారు
బిచ్కుంద(జుక్కల్): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయని, అధికారులు, నాయ కులు, కాంట్రాక్టర్ చేతివాటం ప్రదర్శించి లబ్ధిరులకు తెలియకుండా బిల్లులు నొక్కేశారని ఆరోపిస్తూ మంగళవారం బాన్సువాడలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, బిచ్కుందలో ఎంపీడీవో గోపాల్‌కు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘2023 సెప్టెంబర్‌లో గోపన్‌పల్లిలో కొట్టె పు ష్పలత, సందుల గంగవ్వ, నీరుడి నాగమణి, ఎం. సురేఖ, ఖాజాబీ, వడ్ల గీత, పొట్టి భూమవ్వ, శెట్పల్లి లక్ష్మి, నాయని శోభలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లో మద్నూర్ మండలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఇళ్ల నిర్మాణ ం కోసం పనులు ప్రారంభించారు. బేస్‌మెంట్ వరకు కట్టి వెళ్లి పోయాడు. ఎన్నికలు ముగిశాక పనులు చేయలేదు. లబ్ధిదారులు సొంత డబ్బులతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. బిల్లులు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. అప్పట్లో పంచాయతిరాజ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌తో కుమ్మకై ్క మాకు తెలియకుండానే రూ.3 లోలు బిల్లులు నొక్కేశారు’ అని ఆరోపించారు. అప్పటి గృహలక్ష్మి పథకం జాబితాలో పరిశీలిస్తే ఇళ్ల నిర్మాణం పూర్తయింది.. రూ.3 లక్షల చెల్లించినట్లు జాబితాలో ఉందన్నారు. విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్