
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి
లింగంపేట(ఎల్లారెడ్డి): కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతోందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. సోమవారం ఆయన బాయంపల్లి, అన్నారెడ్డిపల్లి, లింగంపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి మాట్లాడారు. బాయంపల్లిలో రూ. 20 లక్షల నిధులతో జీపీ భవనం నిర్మించినట్లు తెలిపారు. అలాగే లింగంపేట పానాది రోడ్డు స్థానిక పెద్దమ్మ ఆలయం ముందు నుంచి పోస్టాఫీసు వరకు రూ. కోటితో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అన్నారెడ్డిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేయించినట్లు తెలిపారు. లింగంపేట మండల రైతులు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతుండడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడి భూభారతి పైలెట్ ప్రాజెక్టుగా లింగంపేట మండలాన్ని ఎంపిక చేసినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి రఫియోద్దీన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, నేతలు శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, కాశీరాం, ఎల్లమయ్య, అట్టెం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో బీటీ రోడ్లకు..
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని మౌలాన్‌ఖేడ్, వెంకటాపూర్ అగ్రహారం, వెల్లుట్లతాండా, వెల్లుట్ల వెంకటాపూర్, సోమర్యాగడితాండా గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. మల్లయ్యపల్లి, శివాపూర్, అల్మాజీపూర్‌లలో నిర్మించిన నూతన జీపీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబా, సొసైటీ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, తదితరులున్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు