ఆర్మూర్‌టౌన్/నందిపేట్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులో గల రైల్వేట్రాక్‌పై మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మీబాయి(50) ఆదివారం పెర్కిట్‌లోని తన కూతురు ఇంటికి వచ్చింది. కూరగాయల వ్యాపారం చేస్తుండేది. కూతురి ఇంటి నుంచి రాత్రి బయల్దేరిన లక్ష్మీబాయిని గుర్తు తెలియని రైలు ఢీకొంది. ఉదయం గూడ్స్ రైలు వస్తుండగా ట్రాక్‌పై తీవ్రగాయాలతో ఉన్న ఆమె చేతు ఊపడంతో లోకో పైలెట్ గమనించి రైలును నిలిపారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిందన్నారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
రైలు నుంచి జారిపడి యువకుడు..
ఖలీల్‌వాడి: నగరంలోని శాంతినగర్‌కు చెందిన అబ్దుల్ వాజీద్ (29) గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. రైల్వే మేనేజర్ సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు.