
‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చాలి’
కామారెడ్డి టౌన్ : భారతీయ జనసంఘ్ వ్య వస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కార్యకర్తలు నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఆయన దేశ సమైక్యత కోసం ప్రా ణాలను అర్పించిన మహానేత అని కొనియాడారు. 370 ఆర్టికల్ రద్దు కోసం ఉద్యమించిన ఆనాడే ఉద్యమించారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 370 ఆర్టికల్ రద్దు చేసి ఆయన ఆశయాన్ని నెరవేర్చారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరుణతార, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, నాయకులు కుంట లక్ష్మారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
28న ట్రయాథ్లాన్
జిల్లా స్థాయి ఎంపికలు
కామారెడ్డి అర్బన్ : జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 28న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి ట్రయాథ్లాన్ ఎంపిక పో టీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షు డు జైపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్– 10, 12, 14 బాలబాలికల విభాగాల్లో 60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, బ్యాక్ త్రో, 600 మీటర్ల కిడ్స్ జావెలిన్ త్రో, స్టాండింగ్ బోర్డ్ జంప్ అంశాల్లో ఎంపిక పో టీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు.
‘కొత్త పెన్షన్ చట్టాన్ని
రద్దు చేయాలి’
కామారెడ్డి అర్బన్ : కొత్త పెన్షన్ చట్టాన్ని ర ద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసో సియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు హన్మంత్‌రెడ్డి, విజయరామరాజు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ని రసన తెలిపిన అనంతరం పెన్షనర్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ వినతిని ప్రధానమంత్రికి పంపా లని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో అ సోసియేషన్ రాష్ట్ర సలహాదారులు లచ్చ య్య, ప్రతినిధులు గంగారాం, రవీందర్, రా జలింగయ్య, సత్యనారాయణ, విశ్రాంత ఉ పాధ్యాయులు పాల్గొన్నారు.
కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయలలో విలేకరులతో మాట్లాడారు. ప్రొటోకాల్ పేరిట ఎమ్మెల్యే అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. వెంకటరమణారెడ్డి సొంత మెనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, గోనె శ్రీనివాస్, సందీప్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌వోగా నరహరి
కామారెడ్డి క్రైం : కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వోగా రెండేళ్లుగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి బదిలీ అయ్యారు. మల్టీ జోన్–1 పరిధిలో ఏడుగురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కామారెడ్డి ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి మల్టీ జోన్–1 కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్నారు. ఆయన స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న నరహరి రానున్నారు.

‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చాలి’

‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చాలి’

‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చాలి’