పెద్దకొడప్‌గల్(జుక్కల్): ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని పెద్దకొడప్‌గల్ ఇన్‌చార్జి విద్యుత్ మండల అధికారి పవన్ కుమార్ పేర్కొన్నారు.
ఆదివారం పెద్దకొడప్‌గల్ గ్రామ శివారులో 33 కేవీ లైన్ ఏబీ స్విచ్ బిగించామని తెలిపారు. పెద్దకొడప్‌గల్, శివాపూర్ సబ్‌స్టేషన్‌లకు నిరంతరం విద్యుత్ ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ గతంలో ఏబీ స్విచ్ లేకపోవడం వల్ల సమస్య ఏర్పడిందని, ఇప్పడు ఏబీ స్విచ్ పెద్దకొడప్‌గల్‌లో బిగించడం వల్ల ఆ సమస్య తీరిందని చెప్పారు. లైన్‌మెన్ కాశీరాం, రాజేష్ పాల్గొన్నారు.