
ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలుపుకుంటా
దోమకొండ: ఎన్నికల్లో తాను ఇచ్చిన మాట నిలుపుకుంటానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. దోమకొండతోపాటు ముత్యపే ట గ్రామంలో శనివారం తన సొంత నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు.తన సొంత నిధులతో కుల సంఘాలకు భననాలు, ఆలయాల నిర్మాణాల కోసం ఇచ్చిన మాట నిలుపుకొని పనులు చేసినట్లు వివరించారు. అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి నరేందర్ రెడ్డి, దోమకొండ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సెక్రెటరీ అంజన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు మహేందర్ గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు నరేందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు మనోజ్ కుమార్, గ్రామ అధ్యక్షుడు ముత్తి బుచ్చిరాజు, సెక్రెటరీ నరేన్ గౌడ్, బాలరాజు, తిరుపతిరెడ్డి, దేవరాజు పాల్గొన్నారు.
బీబీపేట: మండలంలోని ఉప్పర్‌పల్లి, యాడారం, మల్కాపూర్ గ్రామాల్లోని పలు ఆలయాల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. నాయకులు సంతోష్‌గౌడ్, రవీందర్, పోసు శివ, దేవరాజుగౌడ్, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే
కాటిపల్లి వెంకటరమణారెడ్డి
పలు గ్రామాల్లో అభివృద్ధి
పనుల ప్రారంభం

ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలుపుకుంటా