
నరసన్న స్ఫూర్తితో ఉద్యమిద్దాం
నిజామాబాద్ సిటీ: దేశానికే అన్నం పెట్టే రైతన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారి సమస్యలు తీర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు విమర్శించారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్‌ఆర్ భవన్‌లో నాయక్‌వాడి నర్సయ్య సంతాప సభ శనివారం నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కోటేశ్వరరావు మాట్లాడుతూ నరసన్న అమరత్వా న్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి మాట్లాడుతూ కేంద్ర ప్ర భుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ప్రశ్నించే వారిని, అమాయక ఆదివాసీలను, ఎన్‌కౌంటర్ల పేరిట హత్య చేస్తుందని వీటిని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ నర్సయ్య మరణించేంత వరకు రైతు కూలీల సమస్యలపై ఉద్యమించాడని కొనియాడారు. అనంత రం నాయకులు వేల్పూర్ భూమయ్య, నీలం సాయిబాబా, దేశెట్టి సాయరెడ్డి ప్రసంగించారు. పరువ య్య, కారల్ మార్క్స్, గోపాల్, సాయిలు, దిగంబ ర్, పరిచూరి శ్రీధర్, శివకుమార్, రాజేశ్వర్, భా స్కర్, జీ రమేశ్, భారతి, సూర్య శివాజీ, ఎన్ దాసు, జేఏసీ గంగాధర్, చిన్నయ్య, దేవయ్య, సుప్రియ, నాయక్‌వాడి విజయ తదితరులు పాల్గొన్నారు.