ఆర్టీసీ స్మార్ట్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ స్మార్ట్‌ సేవలు

May 16 2025 1:22 AM | Updated on May 16 2025 1:22 AM

ఆర్టీ

ఆర్టీసీ స్మార్ట్‌ సేవలు

కామారెడ్డి టౌన్‌ : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రగతి రథం పరుగులు పెడుతోంది. ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తూనే సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ప్రయాణికుల కోసం అనేక రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా క్యూఆర్‌ కోడ్‌ కీ చైన్‌ల సేవలతో మరింత స్మార్ట్‌ అయ్యింది. ప్రత్యేకంగా తయారు చేసిన తెలంగాణ ఆర్టీసీ సంస్థ కీ చైన్‌లపై క్యూ ఆర్‌కోడ్‌ను ముద్రించి ప్రయాణికులకు అందజేస్తోంది. దీన్ని స్కాన్‌ చేస్తే పూర్తి సమాచారం మన అరచేతిలో ఉంటుంది.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారు. అందుకు తగినట్లుగా ఆర్టీసీ సమాచారాన్ని చేరువ చేస్తోంది. కీ చైన్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆర్టీసీ అందించే సేవలు కనిపిస్తాయి.

కావాల్సిన వివరాలు ప్రత్యక్షం

ఫోన్‌లో గూగుల్‌ ఓపెన్‌న్‌ చేసి పైన కనిపించే కెమెరాపై క్లిక్‌ చేయాలి. అనంతరం కీ చైన్‌పై రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే కావాల్సిన వివరాలు ప్రత్యక్షమవుతాయి. మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో మన వివరాలు పొందుపరిస్తే దీన్ని వినియోగించుకో వడం మరింత సులభమవుతుంది. సలహాలు, సమస్యలపై సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వివాహాది శుభకార్యాలతోపాటు విహార యాత్రలకు బస్సులను రాయితీపై బుక్‌ చేసుకొనే విధానం కూడా అందుబాటులో ఉంది.

పది రకాల యాప్‌లు

ఆర్టీసీ అందించే కీ చైన్‌లోని క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే పది రకాల యాప్‌లు ఉంటాయి. గమ్యం యాప్‌ ద్వారా మనం ప్ర యాణించాల్సిన బస్సు ఎక్కడుంది. గమ్యా నికి ఎప్పుడు చేరుకోవచ్చు వంటి వివరాలు తెలుసుకునే వీలుంటుంది. లైవ్‌ ట్రాకింగ్‌, టికెట్‌ బు కింగ్‌ తదితర సేవలతోపాటు ఇన్‌స్ట్రాగామ్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ చాన ల్‌, యూట్యూబ్‌ వంటివి కనిపిస్తాయి.

క్యూఆర్‌ కోడ్‌లో ఆర్టీసీ సమాచారం

స్కాన్‌ చేస్తే చాలు కళ్ల ముందు

అన్ని రకాల సేవలు

ప్రయాణికులకు ప్రత్యేక కీ చైన్‌లు

ప్రజలకు మరింత చేరువయ్యేలా

ఆర్టీసీ కీచైన్‌లను ప్రయాణికులకు బహుమతుల రూపంలో ప్రత్యేక సందర్భాల్లో , ఉచితంగా అందజేస్తున్నాం. ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండటం, మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న కీచైన్‌లను ఆర్టీసీ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలా సులువుగా సేవలు పొందొచ్చు. సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – కరుణశ్రీ, ఆర్టీసీ డిపో మేనేజర్‌, కామారెడ్డి

ఆర్టీసీ స్మార్ట్‌ సేవలు1
1/1

ఆర్టీసీ స్మార్ట్‌ సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement