పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం! | - | Sakshi
Sakshi News home page

పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!

May 17 2025 6:38 AM | Updated on May 17 2025 6:38 AM

పిచ్చ

పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!

శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025

IIలో u

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కల్తీకల్లు కోసం ఉపయోగించే రసాయనాలు, కల్లు తయారీదారులను పట్టుకునే విషయంలో అధికార యంత్రాంగం విచిత్రంగా వ్యవహరిస్తోంది. భారీ స్థాయిలో రసాయనాలను సరఫరా చేస్తున్న వా రిని, తక్కువ ధరకు లభించే డ్రగ్స్‌ ను కల్లు తయారీకి ఉపయోగించేలా ప్రయోగాలు చేస్తున్నవారిని వదిలేసి కల్లు సొసైటీ సభ్యులుగా ఉండి చిన్నపాటి డిపోలను నిర్వహిస్తున్న తమపైనే ప్రతాపం చూపిస్తున్నారని గౌడ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. రూ.కోట్లలో వ్యాపారాలు చేస్తూ భారీగా రసాయనాలను రవాణా చేస్తున్న వారిని వదిలేసి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మాదిరిగా తమను ఇబ్బందులపాలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కేసుల లెక్కల కోసం ఇలా చేయడం సరికాదంటున్నారు.

కల్లుపై ప్రయోగాలు

కృత్రిమ కల్లును గతంలో క్లోరోహైడ్రేట్‌ రసాయనంతో తయారు చేసేవారు. ప్రభుత్వం దీన్ని నిషేధించాక డైజోఫాం ఉపయోగించారు. ప్రస్తుతం అల్ప్రాజోలం రసాయనం వాడుతున్నారు. ఈ రసాయనా లు సాధారణంగానే అత్యంత ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో గుండెపోటు, కిడ్నీ, జీర్ణవ్యవస్థ దెబ్బ తినడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది. ఇక మోతాదు పెంచితే తాగినవాళ్లు కుప్పకూలాల్సిందే. కాగా ఈ రసాయనాల కొనుగోలు ఖర్చును మరింతగా తగ్గించుకొని, అధిక లాభాలను ఆర్జించేందు కు సరికొత్తగా కొందరు బడా ముదుర్లు కల్లు ప్రియులపై యథేచ్ఛగా ప్రయోగాలు చేసేందుకు వెనుకాడడం లేదని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఇలాంటి బడా ముదుర్లను వదలి తమపై అధికార యంత్రాంగం ప్రతాపం చూపడంపై కల్లు సొసైటీల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాళ్లలో అల్ప్రాజోలం రసాయనాన్ని సరఫరా చేస్తున్న వారిని పట్టుకోవడం మాని కేవలం రెండు నుంచి మూడు కిలోలు తెచ్చుకుంటున్న తమపై కేసులు నమోదు చేసి ఉన్నతాధికారుల వద్ద జిల్లా అధికారులు మెప్పు పొందుతున్నారని సొసైటీల సభ్యులు చెబుతున్నారు. అల్ప్రాజోలం విషయానికొస్తే ఉమ్మడి జిల్లాలో 2023లో 6.4 కిలోలు, 2024లో 9.6 కిలోలు, 2025లో ఇప్పటి వరకు 0.25 కిలోలు మాత్రమే పట్టుకోవడం గమనార్హం. ఇదంతా గమనిస్తే బడా ముదుర్లను మాత్రం వదిలేస్తున్నట్లు అర్థమవుతోందని సొసైటీల సభ్యులు అంటున్నారు.

న్యూస్‌రీల్‌

రసాయనాల బదులు..

కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామంలో గతనెల 7వ తేదీన కల్లుడిపోలో కల్లు తాగిన 69 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇందులో 17 మందిపై తీవ్ర ప్రభావం చూపడంతో నిజామాబాద్‌ జీజీహెచ్‌లో 72 గంటలపాటు వైద్య చికిత్సలు అందించారు. చికిత్స సమయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షణాలు కనిపించడంతో క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు.. కల్లు తయారీలో కలిపిన రసాయనాల విషయమై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులకు గంటల వ్యవధిలోనే నాడీవ్యవస్థ దెబ్బతినడంతోపాటు నాలుక దొడ్డుగా మారడం, డిస్టోనియా(మరమనిషి మాదిరిగా), రిజిడ్‌(గట్టిగా), సిరలు పడిపోవడం, నొప్పులు తదితర లక్షణాలు కనిపించాయి. దీంతో కొత్తగా ‘యాంటీ సైకోటిక్‌ గ్రూపు’నకు చెందిన డ్రగ్స్‌ను వాడినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ యాంటీ సైకోటిక్‌ గ్రూపులోని డ్రగ్స్‌ను ‘మేజర్‌ మెంటల్‌ డిజార్డర్‌’ ఉన్నవారికి ఉపయోగిస్తారు. ఈ డ్రగ్‌ పేషెంట్‌ను కామ్‌డౌన్‌ చేస్తుంది. అయితే యాంటీ సైకోటిక్‌ గ్రూపులో క్లోర్‌ప్రామజిన్‌ లాంటి మరో ఐదురకాల డ్రగ్స్‌ ఉంటాయి. ఇలా రసాయనాల బదులు కొత్త రకం డ్రగ్స్‌తో కల్లు ప్రియులపై ప్రయోగాలు చేస్తున్నవారిని వదిలి అధికారులు తమపై ప్రతాపం చూపుతున్నారని సొసైటీల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కృత్రిమ కల్లు తయారీలో కల్లు సొసైటీలపైనే

అధికారుల ప్రతాపం

కొత్త రకం డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న

మాఫియాకు మినహాయింపు

‘యాంటీ సైకోటిక్‌ డ్రగ్స్‌’ వాడకాన్ని

ప్రోత్సహిస్తున్న ముదుర్లు

తక్కువ ఖర్చుతో లభించే రసాయనాల

వైపు కొందరి చూపు

అధికారుల తీరుపై విమర్శలు

పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం! 1
1/2

పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!

పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం! 2
2/2

పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement