‘వేగంగా కాంటాలు వేయడం అభినందనీయం’ | - | Sakshi
Sakshi News home page

‘వేగంగా కాంటాలు వేయడం అభినందనీయం’

May 17 2025 6:38 AM | Updated on May 17 2025 6:38 AM

‘వేగం

‘వేగంగా కాంటాలు వేయడం అభినందనీయం’

భిక్కనూరు: రైతులకు ఇబ్బందులు కలుగకుండా వేగవంతంగా వరిధాన్యం కాంటా లు చేయడం అభినందనీయమని జిల్లా స హకార అధికారి రామ్మోహన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పెద్దమల్లారెడ్డిలో సింగిల్‌ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగో లు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 రోజుల్లో 40 వే ల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైసుమిల్లులకు పంపించామన్నారు. విండో చైర్మ న్‌ రాజాగౌడ్‌ను అభినందించారు. కొనుగోళ్ల టార్గెట్‌ను పూర్తిచేసినందున పెద్దమల్లారెడ్డి సింగిల్‌విండో కొనుగోలు కేంద్రాన్ని మూసి వేశామన్నారు. ఇదే స్ఫూర్తితో మిగతా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా వేగవంతంగా కొనుగోళ్లను పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ధాన్యం కొనుగోలు కేంద్రాల జిల్లా మానిటరింగ్‌ అధికారి నగేష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, విండో చైర్మన్‌ రాజాగౌడ్‌, సీఈవో మోహన్‌గౌడ్‌ ఉన్నారు.

విద్యార్థుల సంఖ్య పెంచాలి

మాచారెడ్డి: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని విద్యా శాఖ జాయింట్‌ డై రెక్టర్‌ ఉషారాణి సూచించారు. శుక్రవారం ఆ మె పాల్వంచలో నిర్వహించిన బడి బాట, వి ద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్ర భుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ప్రైవేట్‌ పాఠశాలకు వెళ్ళే ఇద్ద రు విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. అనంతరం పదో తరగతిలో అత్యధిక మా ర్కులు సాధించిన విద్యార్థులతో పాటు ప్ర ధానోపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డిని అభినందించారు.

దేవునిపల్లిలో..

కామారెడ్డి రూరల్‌: కామారెడ్డి మున్సిపల్‌ ప రిధిలోని దేవునిపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ని ర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపు ముగింపు సమా వేశానికి ఉషారాణి హాజరయ్యారు. విద్యార్థు ల నృత్య ప్రదర్శనను పరిశీలించి, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్‌, ఉపాధ్యాయులు లావణ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ క్యూఆర్‌ కోడ్‌ కీచైన్‌ల పంపిణీ

కామారెడ్డి టౌన్‌: ఆర్టీసీ రిజినల్‌ మేనేజర్‌ జ్యోత్స్న శుక్రవారం కామారెడ్డి డిపోను సందర్శించారు. డిపో పరిధిలోని సిబ్బందికి, పోలీసులకు సంస్థ క్యూఆర్‌ కోడ్‌ కీచైన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే బస్సుల సమయ సమాచారం, బస్సు ఎక్కడ ఉందన్న వివరాలు తెలుస్తాయన్నారు. 10 రకాల యాప్‌లతో కూడిన సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ కరుణశ్రీ, అసిస్టెంట్‌ మేనేజర్‌ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణం ప్రారంభం

కామారెడ్డి రూరల్‌: పాతరాజంపేటలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్‌ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం చేపట్టినవారికి దశలవారీగా బిల్లులు మంజూరవుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌రెడ్డి, హౌసింగ్‌ ఏఈ అశోక్‌, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్లు రాజేందర్‌, నర్సింహారెడ్డి మాజీ సర్పంచ్‌ బత్తుల చందన రవి, నాయకులు లక్ష్మణ్‌, లక్ష్మణ్‌, భాస్కర్‌, యూసుఫ్‌, రాజయ్య, లింగం తదితరులు పాల్గొన్నారు.

‘వేగంగా కాంటాలు వేయడం  అభినందనీయం’ 
1
1/2

‘వేగంగా కాంటాలు వేయడం అభినందనీయం’

‘వేగంగా కాంటాలు వేయడం  అభినందనీయం’ 
2
2/2

‘వేగంగా కాంటాలు వేయడం అభినందనీయం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement