
‘ఈ పాస్’తోనే ఎరువులు విక్రయించాలి
కామారెడ్డి క్రైం: కేంద్రప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి డీలర్ ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులను విక్రయించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లాలోని 360 మంది ఎరువుల డీలర్లకు ప్రస్తుతం వాడుతున్న ఎల్–0 రకం ఈ పాస్ మిషన్‌ల స్థానంలో కొత్తగా వచ్చిన ఎల్–1 ఈ పాస్ మిషన్‌లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎరువులు విక్రయించే డీలర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. రైతుల ఆధార్‌తో అనుసంధానం చేస్తూ ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయాలు జరపాలన్నారు. కార్యక్రమంలో డీఏవో తిరుమల ప్రసాద్, ఏడీఏలు, ఏవోలు, డీలర్లు, ఇఫ్కో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రేపు జాబ్ మేళా
కామారెడ్డి క్రైం: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని వరుణ్ మోటార్స్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ, మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లొమా చదివిన వారు అర్హులని, 18 నుంచి 30 ఏళ్లు వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థ్ధులు తమ బయోడేటా, సర్టిఫికెట్‌లతో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 98854 53222, 76719 74009 నంబర్‌లను సంప్రదించాలని సూచించారు.
ఎక్కువ లాభాలు అర్జించాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): పంటల సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించాలని జేడీ తిరుమల ప్రసాద్ అన్నారు. లింగంపేట మండలం మోతె గ్రామంలోని రైతు వేదికలో గురువారం ‘రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ రైతులకు పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు వివరించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. సాగునీరు, పంటల సాగు యాజమాన్యంపై సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అంజయ్య, భాస్కరన్, అనిల్‌కుమార్, రత్నం, జ్యోతి, అనిల్‌రెడ్డి, రేవంత్‌నాథన్, గ్రామపెద్దలు రాంరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

‘ఈ పాస్’తోనే ఎరువులు విక్రయించాలి