
సాక్షి కథనాలు.. పరిష్కారాలు
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మండలంలోని ప్రజా సమస్యలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చి కథనాలను ప్రచురించి ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఎన్నో ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించింది. బాధితుల పక్షాన ఉంటూ మన్ననలు పొందుతోంది. ఏప్రిల్ నెలలో బిచ్కుంద మండలంలో ఏడు సమస్యలు ప్రచురించగా అధికారులు పరిష్కరించారు. 6వ తేదీన దౌల్తాపూర్‌ను వణికిస్తున్న విషజ్వరాలు.. కథనాలతో వైద్య ఆరోగ్య శాఖ స్పందించి మూడు రోజులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్తనమూనాలు సేకరించి వైద్యం అందించారు. 10న మురికి కూపంగా బస్టాండ్.. కథనంతో డీపీవో మురళి స్పందించి బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్ సందర్శిచి మురికి తొలగించి శుభ్రం చేయించారు. 16న ప్రమాదకరంగా ముళ్లపొదలు... కథనం ప్రచురించగా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి బిచ్కుంద–కందర్‌పల్లి రోడ్డు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను ప్లొకెయిన్‌తో తొలగించి శుభ్రం చేయించారు. 18న ఆడవాళ్ల ఆత్మగౌరవం పట్టదా... ప్రచురించిన కథనానికి బాన్సువాడ ఆర్టీసీ డీఎం సరితాదేవి స్పందించి మరుగుదొడ్ల విరిగిన తలుపులకు మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించారు. 24న స్కావెంజర్ డబ్బులు కాజేత... వచ్చిన కథనానికి విద్యా శాఖ అధికారులు స్పందించి విచారణ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎం కాజేసిన స్కావెంజర్ రూ.13 వేలు తిరిగి ఇచ్చేశారు. మే 2న పడకేసిన పారిశుధ్యం...అనే వచ్చిన కథనానికి అధికారులు వెంటనే స్పందించి పరిష్కరానికి చొరవచూపి పారిశుధ్య పనులు చేయించి దౌల్తాపూర్‌లో తాగునీటి సమస్య పరిష్కరించారు. మాతాశిశు సంరక్షణ కార్డుల కొరత... ఎన్నో కథనాలతో సమస్యల పరిష్కరానికి కృషి చేసిన ‘సాక్షి’ కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యలు వెలుగులోకి..
ప్రచురితమైన కథనాలకు స్పందన
బిచ్కుంద మండలంలో
సమస్యలు పరిష్కరించిన అధికారులు

సాక్షి కథనాలు.. పరిష్కారాలు

సాక్షి కథనాలు.. పరిష్కారాలు

సాక్షి కథనాలు.. పరిష్కారాలు

సాక్షి కథనాలు.. పరిష్కారాలు