
సాలంపాడ్‌లో హరితహారం నర్సరీలో మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
బోధన్: కంటి వెలుగు కార్యక్రమంలో లక్ష్యానికి మించి శిబిరాల్లో కంటి వైద్య పరీక్షలు నిర్వహించా లని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారు లు, వైద్య సిబ్బందిని ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాలను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. క్షేత్రస్థాయి లో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బుధవారం సాలూర మండలంలోని కుమ్మన్‌పల్లి, సాలంపాడ్ గ్రామాల్లో కలెక్ట ర్ పర్యటించారు. కుమ్మన్‌పల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని తనిఖీ చేశారు. శిబిరానికి రోజు వారీగా కంటి వైద్య పరీక్షల కోసం ఎంత మంది వస్తున్నారు. సరిపడా అద్దాలు అందుబాటులో ఉన్నాయా.. ఇంకా ప్రజలు ఎలాంటి సేవలు ఆశిస్తున్నారని వైద్య సి బ్బందిని అడిగి తెలుసుకున్నారు. కుమ్మన్‌పల్లి, సాలంపాడ్ గ్రామాల్లో హరితహారం నర్సరీలను పరిశీలించారు. నర్సరీల్లో అక్కడక్కడా మొక్కలు ఎండిపోయి ఉండడాన్ని గమనించి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి ఎండలు తీవ్రమవుతున్నందున మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించాలన్నారు. ఎండ నుంచి రక్షణకు గ్రీన్‌షెడ్‌లు ఏ ర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ జనాభాకు అనుగుణంగా సరిపడా సంఖ్యలో నర్సరీల్లో మొక్కలు పెంచాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూముల పరిశీలన
బోధన్ పట్టణ శివారులోని పాండు తర్పాలో 67 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఈ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. పది ఎకరాలు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు, కేంద్రీయ విద్యాలయ నూతన భవన నిర్మా ణం కోసం ఎనిమిది ఎకరాలు కేటాయించినట్లు ఆర్డీవో కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట తహ సీల్దార్ వర ప్రసాద్, ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ తదితరులున్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు

కుమ్మన్‌పల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు