‘కల్ట్‌’ షూటింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘కల్ట్‌’ షూటింగ్‌ ప్రారంభం

Nov 27 2025 6:21 AM | Updated on Nov 27 2025 6:21 AM

‘కల్ట

‘కల్ట్‌’ షూటింగ్‌ ప్రారంభం

బోట్‌క్లబ్‌: అస్త్ర మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నిర్మించనున్న ‘కల్ట్‌’ సినిమాకు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో డైరెక్టర్‌ హరీష్‌ ముహూర్తపు షాట్‌ను క్లాప్‌ కొట్టి బుధవారం ప్రారంభించారు. నూతన నటీనటులతో సినిమాలను నిర్మిస్తున్నట్లు కో నిర్మాత ప్రసాద్‌ తెలిపారు. హీరో శ్రీమంత్‌, హీరోయిన్‌ అక్షర మాట్లాడుతూ యువతలో క్రికెట్‌ పట్ల ఉండే ఇష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తీస్తున్నట్టు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను తీస్తున్నటు తెలిపారు. గతంలో సర్కర్‌ , ఆలోచించు అర్జున్‌ తదితర సినిమాలు తీశామన్నారు.

షణ్ముఖనాథునికి

ప్రత్యేక పూజలు

కరప: సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా బుధవారం జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. షణ్ముఖ నాథునికి తెల్లవారు జాము నుంచి భక్తులు పూజలు, అభిషేకాలు చేయించుకున్నారు. పెనుగుదురు – కరప, గ్రామాల మధ్య నిర్మించిన 51 అడుగుల వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం వద్ద తెల్లవారు జాము నుంచి వేద పండితులు ఆగమశాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిక్కాల దొరబాబు, సావిత్రి దంపతులు, సుబ్బారావు, అనూరాధ దంపతులతో వివిధ పూజా కార్యక్రమాలు జరిపించారు. సిరిపురం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త చిక్కాల దొరబాబు, సుబ్బారావు సోదరులు ఈ విగ్రహాన్ని నిర్మించారు.

11న మాదిగల

ఆత్మీయ కలయిక

అమలాపురం రూరల్‌: అమలాపురం మండలం పేరూరు కొంకాపల్లిలోని సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వచ్చే నెల 11న ఉదయం 10 గంటలకు మాదిగల ఆత్మీయ కలయిక జరుగుతుందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ తెలిపారు. మండలంలోని రోళ్లపాలెం గ్రామంలో నేదునూరి నాతానియేలు నివాసం వద్ద బుధవారం జరిగిన సమావేశంలో మాదిగల ఆత్మీయ కలయిక పోస్టర్‌ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు, వర్గాలకు, ప్రాంతాలకతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, మేధావులు, ఉద్యోగులు పెద్దఎత్తున హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడికి శ్రీరాములు, నూటుకుర్తి సత్యనారాయణ, బడుగు శ్రీనివాసరావు, పెదపూడి శ్రీనివాసరావు, మంద రామకృష్ణ, సవరపు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి విరాళం

అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు నాయర్‌ నిఖిల్‌, వెంకట సత్యపావని దంపతులు బుధవారం రూ.25 వేలు విరాళం అందజేశారు. ఈ సొమ్మును దాత ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావుకు అందజేశారు. దాతను వేదమంత్రాలతో సత్కరించి స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

‘కల్ట్‌’ షూటింగ్‌ ప్రారంభం 1
1/3

‘కల్ట్‌’ షూటింగ్‌ ప్రారంభం

‘కల్ట్‌’ షూటింగ్‌ ప్రారంభం 2
2/3

‘కల్ట్‌’ షూటింగ్‌ ప్రారంభం

‘కల్ట్‌’ షూటింగ్‌ ప్రారంభం 3
3/3

‘కల్ట్‌’ షూటింగ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement