● దిగంబరా.. దిగంబరా.. శ్రీపాద వల్లభ దిగంబరా..
స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అభిషేకాలు, ప్ర త్యేక పూజలతో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. తొ లి రోజు స్వామివారి పల్లకీ సేవ పుర వీధుల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తమ చెంతకే వచ్చిన స్వామిని కన్నులారా తిలకించి భక్తులు పులకించిపోయారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి అవతారంగా భక్తులు భావించే శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలం కావడంతో పిఠాపురంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక్కడకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పా టు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భ క్తులు తరలి వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరాఠీ భక్తులు ఈ వారం రోజులూ ఇక్కడే ఉండి ఉత్సవాల్లో స్వయంగా పాల్గొంటారు. ఈ ఏడాది సుమారు 30 వేల మంది మరాఠీ భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈఓ ఆర్.సౌజన్య తెలిపారు.
– పిఠాపురం


