మన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే గొప్పది
కాకినాడ లీగల్: భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే గొప్పదని, ప్రతి పౌరుడూ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది అన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం కోర్టు హాలులో నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలను రాజ్యాంగం పరిరక్షించేలా న్యాయవ్యవస్థ పనిచేస్తోందన్నారు. ఆరో అదనపు జిల్లా జడ్జి పి.గోవర్ధన్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ప్రసాదించిందన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారతదేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవ సభకు అధ్యక్షత వహించిన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టి.పృథ్వీరాజ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
మూడో అదనపు జిల్లా జడ్జి ఆనంది


