దళారులకే
అమ్ముకోవాల్సి వస్తోంది
ధాన్యం అమ్మాలంటే ముందుగా కనీసం రెండు రోజులపాటు ఆరబెట్టవలసి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం కంటే తక్కువ తేమ ఉండాలనే నిబంధన శాపమైంది. దళారులకు రూ.1,550కు విక్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. సీఎంఆర్‌కు ఇచ్చే 75 కేజీల బస్తాకు రూ.1,777 ఇవ్వాలి. కానీ రూ.1,670 ఇస్తున్నారు. 33శాతం నష్టం అంచనాలతో ఇన్‌పుట్ సబ్సిడీ వస్తుందని చెబుతున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు.
– ఇంటి రమేష్, రైతు,
వీకే రాయపురం, సామర్లకోట మండలం
పంటను ప్రభుత్వం
కొననంటే ఎలా?
నాలుగు ఎకరాల పొలం సాగు చేస్తున్నాను. ఈ ఏడాది పంట ఏపుగా పెరగటంతో ఎకరానికి 40 బస్తాల వరకూ దిగుబడి వస్తుందనుకున్నాను. వర్షాల దెబ్బకు ఎకరానికి 30 బస్తాల చొప్పున నాలుగు ఎకరాలకు 120 బస్తాల దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాలకు వెళితే ఎకరానికి 24 బస్తాల చొప్పున 96 బస్తాలే కొంటామంటున్నారు. అసలే ఈ ఏడాది తుపాను ప్రభావంతో మాసూళ్లకు పెట్టుబడులు అధికమవ్వటమే కాకుండా దిగుబడులు తగ్గిపోయాయి. వచ్చిన పంటను ప్రభుత్వం కొననంటే ఎలా?
–పెంకే సత్యనారాయణ, రైతు కాజులూరు
దళారులకే


